News April 7, 2025
కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.
Similar News
News November 15, 2025
ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

TG: జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్‌లో అతని బైక్‌ను పోలీసులు గుర్తించారు.
News November 15, 2025
96 లక్షల ఫాలోవర్లు.. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి

బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ అభ్యర్థి, యూట్యూబర్ మనీశ్ కశ్యప్ పోటీ చేసి ఓడిపోయారు. చన్‌పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ గెలుపొందారు. యూట్యూబ్‌లో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మనీశ్‌కు 37,172 ఓట్లు రాగా 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడారు. తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో అప్పట్లో అతడిని TN పోలీసులు అరెస్టు చేశారు.


