News December 1, 2024
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం

TG: అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన GHMC ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Similar News
News January 4, 2026
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం MAR 3న మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేసింది. ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని, భక్తులు గమనించాలని TTD కోరింది.
News January 4, 2026
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.
News January 4, 2026
సుదర్శన చక్రం నుంచి దుర్వాసుడు ఎలా తప్పించుకున్నాడు?

సుదర్శన చక్రం నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి దుర్వాసుడు బ్రహ్మ, శివుని వేడుకుంటాడు. కానీ వారు చేతులెత్తేస్తారు. చివరికి విష్ణుమూర్తిని శరణు కోరగా ‘నా భక్తులే నా హృదయం. అంబరీషుడిని క్షమాపణ కోరితేనే విముక్తి’ అని చెబుతారు. దీంతో దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడతాడు. దయామయుడైన అంబరీషుడు ప్రార్థించడంతో సుదర్శన చక్రం శాంతించి వెనక్కి వెళ్తుంది. భక్తుని పట్ల అహంకారం పనికిరాదని దుర్వాసుడు గ్రహిస్తాడు.


