News August 26, 2024

ఐటీ రిటర్న్స్ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఉండాలి: VSR

image

ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా చాలా మందికి ఇంకా రిఫండ్ జమ కాలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ఉన్నట్లే, వాటిని ప్రాసెస్ చేసి రిఫండ్ చేసేందుకు ప్రభుత్వానికి కూడా డెడ్‌లైన్ ఉండాలి. న్యూ ట్యాక్స్ కోడ్‌లో కేంద్రం దీన్ని చేర్చుతుందని ఆశిస్తున్నా’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు Xలో విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 27, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 27, 2025

దానాలు చేస్తే పుణ్యమెలా వస్తుంది?

image

దానం చేయడం వల్ల మనలోని అహంకారం తొలగి, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇతరుల ఆకలిని, అవసరాన్ని తీర్చినప్పుడు కలిగే ఆనందం మనసుకి ప్రశాంతత ఇస్తుంది. స్వార్థం లేకుండా చేసే దానం వల్ల పూర్వజన్మ పాపాలు నశించి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇచ్చే గుణం అలవడటం వల్ల సానుకూల శక్తి పెరిగి, జీవితంలో సంతోషాలు సిద్ధిస్తాయి. దానం కేవలం వస్తువుల మార్పిడి కాదు, మనలోని దయాగుణాన్ని పెంచే ఆధ్యాత్మిక ప్రక్రియ.

News December 27, 2025

KVS, NVSలో ఉద్యోగాలు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

image

<>KVS<<>>, NVSలో 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జనవరి 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ , సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://navodaya.gov.in