News November 7, 2024
సమగ్ర సర్వే దేని కోసమో ప్రభుత్వం చెప్పాలి: DK అరుణ
TG: ప్రభుత్వం చేస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని BJP MP డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
Similar News
News November 7, 2024
జగన్.. ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్?: అనిత
AP: గత పాలనలో అనేక మంది మానప్రాణాలు పోతుంటే పట్టించుకోని జగన్ ఇప్పుడు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని అన్నారు. వైసీపీ హయాంలోనే డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వైసీపీ పాలనలో యువతిని హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతుందని చెప్పారు.
News November 7, 2024
వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక
ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు అనుసరించాల్సిన ప్రొటోకాల్ సిఫార్సులకు ఏర్పాటైన నేషనల్ టాస్క్‌ఫోర్స్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నివేదికలోని అంశాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు బదిలీ అభ్యర్థనను SC తిరస్కరించింది.
News November 7, 2024
రాష్ట్రాన్ని వైసీపీనే అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చింది: అనిత
AP: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యాచారాంధ్ర ప్రదేశ్‌గా మార్చిందని హోంమంత్రి అనిత దుయ్యబట్టారు. ఐదు నెలల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఏమి జరిగిందో ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. తాము చేసిన తప్పులతోనే 11 సీట్లు వచ్చాయని నిన్న మాజీ మంత్రి అన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి 10 గంటలకో అత్యాచారం జరిగిందని తెలిపారు.