News June 15, 2024
అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నీచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు.
Similar News
News November 28, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


