News April 7, 2025
ఫేక్ ప్రచారంపై ప్రముఖులను విచారించేందుకు ప్రభుత్వం చర్యలు!

TG: HCU భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీశ్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. కాగా HCU భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
Similar News
News April 11, 2025
VIRAL: ఓటమి బాధలో కోహ్లీ(PHOTO)

నిన్న ఢిల్లీ చేతిలో సొంతగడ్డపై ఓటమితో ఆర్సీబీ ప్లేయర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీ తీవ్రమైన బాధలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇతర చోట్ల విజయం సాధించినా సొంత గ్రౌండ్లో వరుస పరాజయాలు ఆర్సీబీ ప్లేయర్లను బాధిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్సుతో బెంగళూరుకు మ్యాచును దూరం చేశారు.
News April 11, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.
News April 11, 2025
PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.