News October 12, 2025
విశాఖ ఉక్కుకు ప్రభుత్వం అండ.. ₹2,400 కోట్లు..

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ఉపశమనం కల్పించింది. EPDCLకు ప్లాంట్ చెల్లించాల్సిన ₹754 కోట్ల బకాయిలు, వచ్చే రెండేళ్ల ఛార్జీలతో కలిపి రూ.2,400 కోట్లను RINLలో ఈక్విటీ కింద పెట్టుబడిగా పెట్టే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మొత్తాన్ని నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ వాటా మూలధనంగా EPDCLకు బదలాయించేందుకు ఓకే చెప్పింది.
Similar News
News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్‌లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.
News October 12, 2025
నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
News October 12, 2025
నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025ను ప్రకటించింది. ప్రజాసేవ, సామాజికంగా ప్రభావితం చేసే అంశాల్లో ఆమె సేవలకుగాను ఈ అవార్డు దక్కింది. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో NOV 4న ఈ అవార్డు అందజేస్తారు. దీనిపై CM చంద్రబాబు ఆమెను అభినందిస్తూ SMలో పోస్టు చేశారు.