News January 10, 2025

లేఔట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం GOలు తెచ్చింది. లేఔట్లలో రోడ్లను 12M బదులు 9Mలకు కుదిస్తూ, 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్‌కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.

Similar News

News January 10, 2025

ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు

image

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.

News January 10, 2025

దేశంలో లాక్డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB

image

దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్‌నెయిల్స్‌తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.

News January 10, 2025

హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్

image

టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.