News October 15, 2024

‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్ తీసుకురానున్న ప్రభుత్వం?

image

AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.

Similar News

News October 31, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని IMD తెలిపింది. కాగా ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో పొడివాతావరణం కనిపించింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.

News October 31, 2025

తక్షణమే సాయం చేయండి.. కేంద్రానికి ఏపీ నివేదిక

image

AP: మొంథా తుఫాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. 1.38L హెక్టార్లలో పంట నష్టం, 2.96L మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని తెలిపింది. ‘249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం పడింది. రైతులకు ₹829Cr నష్టం వచ్చింది. రోడ్లు, విద్యుత్ సహా 17 రంగాల్లో ₹5,244Cr నష్టం వాటిల్లింది. పరిశీలనకు కేంద్ర బృందాలను పంపి తక్షణమే సాయం అందించాలి’ అని కోరింది.

News October 31, 2025

ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

image

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) ఆస్పత్రిలో చేరారు. మెడికల్ చెకప్ కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఇండియా టుడే తెలిపింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటికి సర్జరీ జరిగింది. ఈ దిగ్గజ నటుడు షోలే, చుప్కే చుప్కే, అనుపమ, సీతా ఔర్ గీతా, ధర్మవీర్, జీవన్ మృత్యు లాంటి 300కు పైగా సినిమాల్లో నటించారు.