News September 3, 2025
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు ప్రభుత్వం!

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా SEP 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే.
Similar News
News September 3, 2025
బ్యాంక్‌లో కొలువు కొట్టేయాలంటే..?

బ్యాంకు ఉద్యోగాలకు ఏడాది పొడవునా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మరి ఆ జాబ్ కొట్టాలంటే అర్థమెటిక్, రీజనింగ్, ఆంగ్లంలో పట్టు ఉంటే సరిపోదు. పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రాక్టీస్‌లో గ్యాప్ ఇవ్వొద్దు. వీక్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలగాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్‌కి జవాబులు తేవడం సులువే! కానీ జాబ్ రావాలంటే.. ఫాస్ట్‌గా ఆన్సర్ చేయడం చాలా ముఖ్యం.
News September 3, 2025
విద్యార్థులకు రూ.12,000.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

AP: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం NMMS పేరుతో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుంది. పూర్తి వివరాలకు <
News September 3, 2025
ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మీ పేరు చెక్ చేసుకోండి

తెలంగాణ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఓటర్లు ఇక్కడ <