News November 28, 2024
ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News November 28, 2024
బీఆర్ఎస్‌వీ నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి: కేటీఆర్
గురుకుల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్‌వీ నేతల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో మండిపడ్డారు. ‘ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా ? వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2024
‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
News November 28, 2024
రెడ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారనుందని పేర్కొంది.