News July 28, 2024
పథకాల పేర్లపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం: పవన్ కళ్యాణ్

AP: రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం <<13722354>>పేర్లతో<<>> అమలు చేయడం అభినందనీయం అని పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యా కానుకకు రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం, అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం హర్షణీయం అని ట్వీట్ చేశారు. గత సీఎం మాత్రం పథకాలకు తన పేరే పెట్టుకున్నారని విమర్శించారు.
Similar News
News December 4, 2025
తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
News December 4, 2025
లెజెండరీ నిర్మాత కన్నుమూత

లెజెండరీ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాలను శరవణన్ నిర్మించారు. రజినీకాంత్, శివాజీ గణేశన్ వంటి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. సంసారం ఒక చదరంగం, జెమినీ, శివాజీ, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కించారు.
News December 4, 2025
ఫీటస్ హార్ట్‌బీట్ రాకపోవడానికి కారణాలివే..!

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారు.


