News December 2, 2024
ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలిస్తోంది: CM రేవంత్

TG: పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోందని CM రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ ఇందిరమ్మ పాలన అని ‘X’లో పోస్ట్ చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని, ఇది హర్షణీయం అని పేర్కొన్నారు. అటు, సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించనున్న CM కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.
Similar News
News March 23, 2026
ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.
News March 23, 2026
యుద్ధానికి కావాల్సినంత డబ్బుంది: బెస్సెంట్

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా వద్ద కావాల్సినంత డబ్బు ఉందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమర్థించారు. యుద్ధం కోసం అదనంగా కేటాయిస్తున్న నిధులు కేవలం ఎక్స్‌ట్రా మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడా డబ్బు ఇప్పటికే ఉందని తెలిపారు. ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.
News March 23, 2026
మార్చి 23: చరిత్రలో ఈరోజు

1893: ఇంజినీర్ జి.డి.నాయుడు జననం
1934: సినీ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు జననం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ జననం
1987: నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్ (ఫొటోలో), సుఖ్ దేవ్ మరణం
* ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం


