News July 24, 2024
తండాలు, గూడేల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: CM రేవంత్

TG: నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్వశ్చన్ అవర్లో శాసన సభ్యుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘తండాలు,గూడేల్లో విద్య, విద్యుత్, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. సరైన రవాణా సౌకర్యం ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని రేవంత్ తెలిపారు.
Similar News
News November 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు
News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 8, 2025
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంతంటే?

పలు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక విడుదల చేసింది. APలో మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులు రూ.11,323 కోట్లు కాగా తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.4,637 కోట్లుగా పేర్కొంది. దేశంలో అత్యధికంగా కర్ణాటక ఎమ్మెల్యేలకు రూ.14,179 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అటు దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో KAలో 31 మంది, APలో 27 మంది ఉన్నారు.


