News April 12, 2024
ప్రభుత్వం కీలక నిర్ణయం.. గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు

TG: గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో టీచర్లకు నైట్ డ్యూటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్యను 4కు పెంచాలని ఆదేశించారు. ప్రిన్సిపాళ్లు కచ్చితంగా గురుకులంలోనే ఉండాలని, నైట్ డ్యూటీ టీచర్లు హాస్టళ్లలో ఉండి విద్యార్థుల కదలికలను గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
ఓల్డెస్ట్ క్రికెటర్.. స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ

శ్రీలంకతో <<19119596>>జరిగిన <<>>మ్యాచ్‌లో ఒమన్ క్రికెటర్ మహ్మద్ నదీమ్ చరిత్ర సృష్టించారు. T20WCలో హాఫ్ సెంచరీ చేసిన ఓల్డెస్ట్ ప్లేయర్(43Y 161D)గా నిలిచారు. 2009 ఎడిషన్‌లో సనత్ జయసూర్య 39Y 345D వయసులో అర్ధ శతకం చేశారు. మరోవైపు T20WC హిస్టరీలోనే స్లోయెస్ట్(52 B) హాఫ్ సెంచరీని కూడా నదీమ్ నమోదుచేశారు. 2024లో పాక్ ప్లేయర్ రిజ్వాన్ సైతం 52 బంతుల్లో అర్ధశతకం చేశారు.
News February 12, 2026
3rd క్లాసు నుంచే ఏఐ: ధర్మేంద్ర ప్రధాన్

AI రంగంలో భారత్ శరవేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మూడో తరగతి నుంచి అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ చేసే విద్యార్థుల వరకు AIని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన AI కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో మేథో సామర్థ్యానికి లోటు లేదు. AIపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మెషీన్ ఇంటెలిజెన్స్, భావోద్వేగాల కలయికతో AIని సృష్టిస్తే అద్భుతాలు చేయొచ్చు’ అని తెలిపారు.
News February 12, 2026
భారత్ వర్సెస్ పాకిస్థాన్, బంగ్లాదేశ్

T20 WCలో ఈ నెల 15న భారత్-పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది భారత్ వర్సెస్ పాకిస్థాన్ & బంగ్లాదేశ్‌గా చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇండియాతో వైరం వల్ల WC నుంచి బంగ్లా తప్పుకుంది. దానిపై మొసలి కన్నీరు కారుస్తూ PAK దగ్గరైంది. ఆ 2 దేశాలు ఏకమై మనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ పాక్, బంగ్లాను మన కుర్రాళ్లు చావుదెబ్బ కొడతారని IND ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.


