News November 6, 2024
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 3, 2025
‘గుర్తొ’చ్చింది.. గుర్తుంచుకోండి!

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు మరో వారమే(DEC 11) ఉంది. తాజాగా అభ్యర్థులకు SEC సింబల్స్ కేటాయించింది. దీంతో ‘‘గుర్తు’ గుర్తుంచుకో.. అన్నా గుర్తుంచుకో’ అంటూ ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి చేసేందుకు ‘ఒక్క ఛాన్స్’ అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు ఓటర్లు తమ వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసే టైమొచ్చింది. సమర్థులైన అభ్యర్థికే ఓటు వేయాలని తప్పక గుర్తుంచుకోండి.
News December 3, 2025
‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.
News December 3, 2025
ఇది ‘RU-KO’ షో

రాయ్పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.


