News July 29, 2024
ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Similar News
News February 1, 2025
చరిత్ర సృష్టించనున్న నిర్మల
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.
News February 1, 2025
వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు
TG: అంగన్‌వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.
News February 1, 2025
అవును.. చైనా ల్యాబ్ నుంచే కొవిడ్ వచ్చింది: అమెరికా
చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ‘కొవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదు’ అని పేర్కొన్నారు.