News October 27, 2024
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం?

TG: అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికవడం, వారు ఒక ఉద్యోగంలో చేరగానే మిగతా జాబ్స్ బ్యాక్లాగ్ అవడం పెరుగుతోంది. తాజాగా గురుకులాల్లో 2వేల పోస్టులు మిగిలిపోయాయి. దీంతో తిరిగి ‘రీలింక్విష్మెంట్’ను అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం యోచిస్తోంది. ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారి నుంచి మిగతా ఉద్యోగాలను వదులుకున్నట్లు అంగీకార పత్రం తీసుకుంటుంది. దీంతో ఆ పోస్టు తదుపరి మెరిట్ అభ్యర్థికి దక్కుతుంది.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


