News October 10, 2024
దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది. కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.
Similar News
News October 21, 2025
దీపిక-రణ్‌వీర్ కూతురిని చూశారా?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురు దువా ఫొటోను తొలిసారి షేర్ చేశారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వారి కూతురు చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ జంటకు 2018లో వివాహం జరగగా గతేడాది సెప్టెంబర్‌లో పాప జన్మించింది.
News October 21, 2025
సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశ.. నెటిజన్ల ఫైర్!

SA-Aతో 4-డే మ్యాచులకు BCCI ప్రకటించిన IND-A <<18062911>>జట్టులో<<>> సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సర్ఫరాజ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 65+ AVg ఉందని, ఇటీవల ENG-Aపై ఓ మ్యాచులో 92, రంజీ మ్యాచులో 74 రన్స్ చేశారని, 17kgs బరువు తగ్గడంతో పాటు Yo-Yo టెస్ట్ పాసయ్యారని గుర్తుచేస్తున్నారు. దేశవాళీలో బాగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు సెలక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.
News October 21, 2025
30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్

నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 OCT20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా DDLJ దాన్ని అధిగమించింది.