News February 20, 2025
జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో YCP నేతలు సమావేశమయ్యారు. నిన్న గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా మాజీ CM జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News October 29, 2025
దైవారాధనలో ఆహార నియమాలు పాటించాలా?

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>
News October 29, 2025
టాస్ ఓడిన టీమ్ ఇండియా

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్‌వుడ్
News October 29, 2025
అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.


