News March 26, 2025
ప్రజలకు ప్రభుత్వం ‘ఉగాది కానుక’

TG: రేషన్‌కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News March 26, 2025
విద్యార్థులకు వాటర్ బెల్.. విద్యాశాఖ ఉత్తర్వులు

AP: ఎండలు తీవ్రమైన నేపథ్యంలో పాఠశాలలో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.10, 11, మ.12 గంటలకు వాటర్ బెల్ పాటించాలని పేర్కొంది. విద్యార్థులు నీళ్లు తాగేలా ఉపాధ్యాయులు చూడాలని తెలిపింది.
News March 26, 2025
ఓటీటీలో అదరగొడుతున్న ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రూ.450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 7న జీ5లో హిందీ వెర్షన్ విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్-10లో దూసుకెళ్తున్నట్లు జీ5 తెలిపింది. 250మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
News March 26, 2025
కమలం + రెండు ఆకులు = ఆపరేషన్ TN

తమిళనాడులో కొత్త పొత్తు పొడిచేలా ఉంది. AIADMK మళ్లీ NDAలో చేరేలా కనిపిస్తోంది. 2026 TN ఎన్నికల్లో DMKను ఓడించేందుకు కమలం, రెండు ఆకులు కలిసి బరిలోకి దిగొచ్చని విశ్లేషకుల అంచనా. నిన్న ఢిల్లీలో అమిత్‌షాతో పళనిస్వామి (EPS) సహా కీలక నేతలు 2hrs సుదీర్ఘంగా చర్చించారు. అక్కడ సమావేశం అవుతుండగానే DMKను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామని ఇక్కడ అన్నామలై అన్నారు. TN చేరుకున్న EPS సైతం అదే డైలాగ్ వినిపించారు.