News April 10, 2025
ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యాసంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.


