News April 8, 2025
ఆ బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచలేరు: సుప్రీంకోర్టు

తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని స్పష్టం చేసింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించాక గవర్నర్ వాటిని రాష్ట్రపతికి నివేదించలేరని పేర్కొంది. గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై జస్టిస్ పార్దివాలా ధర్మాసనం తాజాగా తీర్పు ఇచ్చింది.
Similar News
News April 17, 2025
టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం

AP: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఆ పార్టీ అధిష్ఠానం కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్గా సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేసింది. సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించింది. TDP అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
News April 17, 2025
నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్లో అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి <
News April 17, 2025
5 సూపర్ ఓవర్లు ఆడి.. నాలుగింట విజయం

IPL: నిన్న RRపై సూపర్ ఓవర్లో గెలుపుతో ఢిల్లీ అరుదైన ఘనత సాధించింది. IPLలో ఇప్పటి వరకు 5 సార్లు సూపర్ ఓవర్లు ఆడి, నాలుగు మ్యాచుల్లో గెలిచిన జట్టుగా నిలిచింది. 2013లో ఒక్కసారే బెంగళూరుపై ఓడింది. గతంతో ఈ రికార్డ్ 3 విజయాలతో పంజాబ్ పేరిట ఉండేది. మొత్తానికి DC 2019లో కోల్కతా, 2020లో పంజాబ్, 2021లో హైదరబాద్, నిన్న RRపై సూపర్ ఓవర్లో విజయాలు అందుకుంది.