News January 9, 2025
‘భూభారతి’కి గవర్నర్ గ్రీన్సిగ్నల్

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 18, 2025
DRDO PXEలో 50 అప్రెంటిస్లు

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News October 18, 2025
ప్రభుత్వానికి ‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ప్రతిపాదనలు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ సవరణకు చర్యలు చేపట్టింది. ఈ నిబంధన సవరించాలని కోరుతూ ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. సర్కార్ ఆమోదం అనంతరం కొత్త సవరణలతో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అటు BC రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
News October 18, 2025
ధన త్రయోదశి: ఉప్పు కొంటున్నారా?

ధన త్రయోదశి నాడు ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగి, ఆనందం, శ్రేయస్సు కలగడానికి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉప్పు కొనడం శుభప్రదం. ఇది సంతోషం, అదృష్టాన్ని తెస్తుంది. లక్ష్మీదేవి తన భక్తులకు తన ఆశీస్సులను కురిపిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు నీటిని చల్లడం పేదరికాన్ని, దుఃఖాన్ని దూరం చేస్తుంది’ అని సూచిస్తున్నారు.