News September 9, 2024
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
వాట్సాప్‌లో ‘కవర్ ఫొటో’ ఫీచర్!

వాట్సాప్ యూజర్లకు త్వరలో ‘కవర్ ఫొటో’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, X తరహాలో ఇందులోనూ ప్రొఫైల్ పిక్ బ్యాక్ గ్రౌండ్‌లో కవర్ ఫొటోను యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ అకౌంట్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారుల కోసం డెవలప్ చేస్తున్నారు. ప్రొఫైల్ పిక్ సెట్టింగ్స్ తరహాలోనే కవర్ ఫొటోను ఎవరెవరు చూడాలనేది కూడా యూజర్లు డిసైడ్ చేసుకోవచ్చు.
News October 28, 2025
SBIలో 10 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

SBIలో 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/CA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News October 28, 2025
కర్నూలు ప్రమాదం.. 19 వాహనాలు తప్పించుకున్నాయ్!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ 2.45amకు డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోగా, బైకు రోడ్డు మధ్యలో పడింది. vకావేరీ బస్సు 2.55am ప్రాంతంలో బైకును ఢీకొట్టింది. అయితే ఈ మధ్యలో 19 వాహనాలు బైకును తప్పించుకొని వెళ్లాయి. ఈ బస్సు డ్రైవర్‌కు అది కనిపించలేదా? నిర్లక్ష్యమా? అనేది తేలాల్సి ఉంది. ఆ బైకును ఒక్కరు పక్కకు జరిపినా 19ప్రాణాలు దక్కేవి.


