News June 15, 2024
ఇద్దరు టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?

AP: ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసన సభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు, చీఫ్ విప్గా ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించిన విషయం తెలిసిందే.
Similar News
News October 29, 2025
అంగన్వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్గఢ్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
News October 29, 2025
మామిడిలో చెదను ఎలా నివారించాలి?

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్ని పూతగా పూయాలి.
News October 29, 2025
పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమను రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. నిజం చెప్పినా ఏంకాదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు చెప్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.


