News October 19, 2024

గవర్నర్ ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారు: స్టాలిన్

image

TN గవర్నర్‌గా రవిని తొలగించాలని CM స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారని విమర్శించారు. రవి ఇవాళ హిందీ భాష మాసోత్సవాలకు హాజరయ్యారు. అక్కడ రాష్ట్రగీతం ఆలపించిన బృందం ‘ద్రవిడ’ అనే పదాన్ని స్కిప్ చేసింది. దీంతో గవర్నర్‌పై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళులను అవమానించడమేనన్నారు. జాతీయ గీతం నుంచి కూడా ద్రవిడ పదం తీసేసే ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు.

Similar News

News October 19, 2024

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం

image

AP: వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు-వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా-ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు-బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది.

News October 19, 2024

డేట్‌లో నేనే డబ్బు కట్టాలని మగాళ్లు భావిస్తారు: శ్రుతిహాసన్

image

డేట్‌కి వెళ్లినప్పుడు బిల్లుల్ని తనతోనే కట్టించాలని అబ్బాయిలు ట్రై చేస్తుంటారని నటి శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘డేట్‌కి వెళ్లినప్పుడు నేనే డబ్బులు పే చేస్తా. ప్రేమను వ్యక్తీకరించడంలో అది నా శైలి. కానీ 3 నెలల తర్వాత కూడా నేను బిల్లు కట్టాలంటే ఎలా? డబ్బుంది కాబట్టి కట్టడం నీకు ఇష్టమనుకున్నా అంటుంటారు కొంతమంది. అందుకే డేట్‌లో బిల్లు సగం మాత్రమే ఇవ్వడం నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.

News October 19, 2024

మార్స్ మంచు కింద జీవం ఉండొచ్చు: నాసా

image

అంగారకుడిపై మంచు ఫలకాల కింద సూక్ష్మ జీవుల ఉనికి ఉండొచ్చని నాసా అంచనా వేసింది. భూమిపైనా అలాంటి ప్రాంతాలున్నాయని పేర్కొంది. ‘మంచు ఫలకాల కింద ఉన్న నీటికి సూర్యరశ్మి తగిలితే ఫోటోసింథసిస్ కారణంగా సూక్ష్మస్థాయిలో జీవం ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్స్‌పై అలాంటి చోట్లే జీవం గురించి అన్వేషించాలి. భూమిపై ఆ ప్రాంతాలను క్రయోకొనైట్ రంధ్రాలుగా పేర్కొంటాం’ అని వివరించింది.