News August 19, 2024
గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం: సిద్దరామయ్య న్యాయవాదులు

ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు.
Similar News
News January 26, 2026
భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: జిన్‌పింగ్

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనా మంచి స్నేహితులు, భాగస్వాములు అని పేర్కొన్నారు. కాగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత 4 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన BRICS సదస్సుతో పాటు పలు ద్వైపాక్షిక సమావేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి.
News January 26, 2026
ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT
News January 26, 2026
ICMRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<


