News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News November 6, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.
News November 6, 2025
NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News November 6, 2025
NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.


