News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన సూర్యాపేట జిల్లా బిడ్డ

సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన నిమ్మనగోటి మల్లేశ్ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటారు. రాష్ట్ర స్థాయిలో 50వ, జోనల్ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పేదింటి బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించారని స్థానికులు అతడిని అభినందించారు. తన విజయంలో తల్లిదండ్రులు, మిత్రుల సహకారం ఉందని మల్లేశ్ తెలిపారు.
Similar News
News October 22, 2025
జాతీయ రహదారి సత్వరంగా పూర్తి చేయాలి: కలెక్టర్

వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారికి 167ఎ నిర్మాణం సత్వరానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 92.38% పూర్తి కాగా మొత్తం 2.6 హెక్టార్ల 3డి పనులు వారం రోజులలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సూర్యలంక బీచ్-2.0 నిధుల్లో పురోగతి వేగవంతం, ఆక్వా పార్క్ 192.42 ఎకరాల్లో నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
News October 22, 2025
అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత..!

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి రెండు రోజులు పాటు పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 22, 2025
జగిత్యాల: ‘జీపీఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి’

భూ భారతి చట్టంపై జీపీవోలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో నూతన జీపీవోలకు విధులు, బాధ్యతలు, భూ భారతి చట్టంపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఓఆర్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సాదా బైనామల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర వాటిపై జీపీఓలకు అవగాహన కల్పించారు. విలేజ్ మ్యాప్ విధి నిర్వహణలో వెంట ఉండాలన్నారు.