News March 11, 2025
GOVT జాబ్ సాధించిన నారాయణపేట జిల్లా యువతి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన జోగు శ్వేతశ్రీ ఇండియన్ రైల్వేలో ఉద్యోగం సాధించారు. ఇటీవల లోకో పైలట్‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో విధుల్లో చేరారు. తల్లిదండ్రులు లేకపోయినా పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఆమె నిరూపించిందని గ్రామస్థులు తెలిపారు. తన భర్త జోగు ప్రవీణ్ సహకారంతో ఈ ఉద్యోగం సాధించానని ఆమె చెప్పారు.
Similar News
News February 24, 2026
HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.