News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే: RM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను TGS RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ఆర్టీసి లాజిస్టిక్స్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 18, 2025
NLG: సొరంగంలో కాలువల్లా పారుతున్న నీరు

ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గడం లేదు. సొరంగంలోని 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటుచేసిన డీ2 ప్రాంతంలో కాలువల పారుతుండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీటిని డివాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి 2.5 కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం ఎక్కడా తగ్గడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
News March 18, 2025
NLG: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఇద్దరు మృతి చెందారు. చండూరుకు చెందిన శేఖర్ రెడ్డి, శ్వేత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు HYDలో ఉంటున్నారు. చిన్న కుమారుడు నిదయ్ రెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డిలతో కలిసి శ్వేత HYD నుంచి జడ్చర్లకు వెళ్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.