News July 10, 2024
ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ VRSకు ప్రభుత్వం ఆమోదం

AP: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)కు ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ప్రభుత్వంలో కీలకమైన సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏడేళ్ల సర్వీస్ ఉండగానే VRSకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లలో నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.
Similar News
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


