News December 2, 2024

విజయవాడ-అమరావతి, విశాఖ మెట్రోకు ప్రభుత్వం ఆమోదం

image

AP: విజయవాడ-అమరావతి, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టులో 46.23kms మేర 3 కారిడార్లను నిర్మించనుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒకటో కారిడార్(34.4kms), గురుద్వార-పాత పోస్టాఫీసు (5.08kms) రెండో కారిడార్, తాడిచెట్లపాలెం-చినవాల్తేర్ (6.75kms) మూడో కారిడార్‌ను నిర్మించనుంది. తొలి దశలో నిర్మాణాలకు ₹11,498cr ఖర్చవుతుందని అంచనా.

Similar News

News November 6, 2025

మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

image

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 6, 2025

నైట్ స్కిన్ కేర్ ఇలా..

image

పగలంతా అలసిపోయిన చర్మం రాత్రివేళ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. ఇందుకోసం యాంటీఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి వయసుని పెంచే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కళ్ల కింద ఉబ్బు వస్తుంటే కెఫీన్ ఉన్న ఐక్రీమ్స్ అప్లై చెయ్యాలి. వాజిలీన్/ కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి మృదువుగా మారతాయి.

News November 6, 2025

చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.