News October 29, 2024

ప్రభుత్వం కబుర్లు చెబుతోంది: BRS

image

TG: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడపాల్సిన పనిని మరిచిపోయి ప్రజలకు కబుర్లు చెప్పడంలో బిజీగా మారిందని ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని, ఆయన అసమర్థత రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. రెవెన్యూ టార్గెట్ రూ.2.74లక్షల కోట్లు కాగా 6 నెలల్లో కేవలం రూ.1.08లక్షల కోట్లు మాత్రమే సాధించినట్లు పేర్కొంది.

Similar News

News November 19, 2025

సంగారెడ్డి: కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పత్తి, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు పారదర్శకంగా జరగాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బాధ్యతలు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాదిరి పాల్గొన్నారు.

హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

image

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.