News August 5, 2024

స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3వేలు, 31-100 మంది ఉంటే రూ.6వేలు, 101-250 మంది ఉంటే రూ.8వేలు, 251-500 మంది ఉంటే రూ.12వేలు, 501-750 మంది ఉంటే రూ.15వేలు, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది.

Similar News

News January 15, 2025

గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?

image

AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.

News January 15, 2025

40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా

image

ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉప‌క‌రిస్తున్న‌ గ్యాస్, ఎనర్జీ స‌దుపాయాలే ల‌క్ష్యంగా ర‌ష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంప‌నుంది.

News January 15, 2025

EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్

image

MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షన్‌కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.