News December 8, 2024

ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500 వంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని, కానీ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Similar News

News October 14, 2025

బంగారం ధరలు పైపైకి.. జర భద్రం తల్లీ

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ సమయంలో మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు, రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో ఎక్కువ ఆభరణాలు ధరించకపోవడమే మేలు. ఇంట్లోని బంగారాన్ని సైతం సురక్షితమైన లాకర్లలో భద్రపరుచుకోవాలి. విలువైన వస్తువులు దొంగిలించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. Share it

News October 14, 2025

APPLY NOW: ఇంటర్‌తో 7,565 పోస్టులు

image

ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రిపేర్ కావాలి. జీతం నెలకు ₹21,700, అలవెన్సులు అదనం. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News October 14, 2025

మోదీ టూర్.. కర్నూలులో 10 మంది మంత్రుల మకాం!

image

AP: ప్రధాని మోదీ కర్నూలు సభ విజయవంతం చేసేందుకు, జన సమీకరణకు 10 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు. 16న జరిగే సభకు 7,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. PM పర్యటించే ప్రాంతాల్లో 200 CC కెమెరాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16 వరకు డ్రోన్ల ఎగరవేతపై ఆయా ప్రాంతాల్లో నిషేధం విధించారు. ప్రధాని సభకు వెళ్లేవారి కోసం దాదాపు 8వేల బస్సులు సమకూరుస్తున్నట్లు సమాచారం.