News July 27, 2024

నర్సింగ్, పారా మెడికల్ ఫీజులు పెంచిన ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో ప్రైవేటు, పారా మెడికల్ కాలేజీల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్‌కు ఎ-కేటగిరిలో ఫీజు రూ.45వేలకు పెరిగింది. బి-కేటగిరిలో రూ.90వేలుగా నిర్ధారించారు. పారామెడికల్ కోర్సుల్లో ఎ-కేటగిరి ఫీజులు కనిష్ఠంగా రూ.27 వేలు, గరిష్ఠంగా రూ.40వేలకు పెంచారు. ఎమ్మెస్సీ నర్సింగ్ సహా MPT కోర్సుల ఫీజులు ఏడాదికి రూ.5వేల చొప్పున పెంచారు. పెంచిన ఫీజులు 2026 వరకు అమల్లో ఉంటాయి.

Similar News

News November 19, 2025

మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

image

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.

News November 19, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

image

సినీ నటి తులసి యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.

News November 19, 2025

వరి పంటకు అజొల్లా చేసే మేలు

image

అజొల్లా జీవన ఎరువు వరిపొలంలో నీటిపై తేలుతూ నత్రజనిని స్థిరీకరించి, వరిపైరుకు నత్రజనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 2KGల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగిస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని, ఇతర పోషకాలను మొక్కలకు అందించి పంటకు మేలు చేస్తుంది. అజోల్లాను పచ్చిరొట్ట ఎరువుగానూ ఉపయోగించవచ్చు.