News August 23, 2024
Govt Jobs: నంద్యాల పోలీసుల హెచ్చరిక!

ఉపాధి కల్పన స్కీం ఫ్రాడ్‌పై నంద్యాల పోలీసులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ‘మిమ్మల్ని ఈ విధంగా ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని సంప్రదిస్తే వారిని నమ్మకండి. ఎవరైనా అలా చెబితే, మొదట మీరు ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారో, లేదో చెక్ చేసుకోండి. ప్రజలు ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను కానీ, సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి’ అని పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.
News February 21, 2026
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఎస్ఎస్వీ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఒక కాలనీలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి చిన్నారి మృతిచెందింది. బోయరేవుల శ్రీదేవి-గోపాల్ దంపతుల కుమార్తె విజయలక్ష్మి(5) ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం వలస వెళ్లగా చిన్నారి అవ్వతాతల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి నీటి తొట్టిలో పడి మరణించింది.
News February 21, 2026
కర్నూలు: ‘పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసేయాలి’

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


