News March 17, 2024

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి <>నోటిఫికేషన్<<>> విడుదల చేసింది. ఇందులో ఫిమేల్ స్టాఫ్ నర్స్ 121, మెస్ హెల్పర్ 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ల్యాబ్ అటెండెంట్ 161 సహా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులను భట్టి టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నాయి. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు వెల్లడి కానున్నాయి.

Similar News

News October 30, 2024

ఆయుష్మాన్ భార‌త్ పెద్ద స్కాం: ఆప్‌

image

ఆయుష్మాన్ భార‌త్‌లో ఢిల్లీ చేర‌క‌పోవ‌డాన్ని PM మోదీ త‌ప్పుబ‌ట్ట‌డంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ ప‌థ‌కం పెద్ద స్కాం అని MP సంజ‌య్ సింగ్ విమ‌ర్శించారు. ఇందులోని నిబంధ‌న‌ల వ‌ల్ల ఒక్క ఢిల్లీ వ్య‌క్తికి కూడా ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌న్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. ద‌ర్యాప్తు జ‌రిపితే ప‌థ‌కంలోని నిర్వ‌హ‌ణ‌ లోపం బయటపడుతుందన్నారు.

News October 30, 2024

ALERT.. కాసేపట్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 30, 2024

పార్టీ నేతలకు CM రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

image

TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్‌మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ ‌కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.