News July 29, 2024

పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి: CM చంద్రబాబు

image

AP: భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. వాటిపై పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాల నమూనాను విడుదల చేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం లాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? ఎటువంటి చట్టాలు తేవాలి? అనే అంశాలపై చర్చించారు.

Similar News

News February 1, 2025

రాష్ట్రంలో ఉక్కపోత షురూ

image

AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News February 1, 2025

బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.

News February 1, 2025

నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు

image

AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.