News July 26, 2024

Govt Schools ఖాళీ అయిపోతున్నాయ్!

image

AP: ఎందరో మహనీయుల్ని తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు ఘోరంగా మారింది. మొత్తం 44వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 6216 స్కూళ్లలో 10మందిలోపే విద్యార్థులున్నారు. 104 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. 81 స్కూళ్లు కేవలం ఒకే విద్యార్థితో నడుస్తున్నాయి. సర్కారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 30, 2026

ఈ నేలలు వేరుశనగ, నువ్వుల సాగుకు అనుకూలం

image

వేరుశనగ: ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్ఠం. చల్కా, ఎర్రగరప నేలలు కూడా అనుకూలం. ఎక్కువ బంక మట్టిగల నల్ల రేగడి నేలల్లో పంట వేయరాదు. నేల pH 6.5-7.0 ఉండి, 20-30 సెం.మీ లోతు వరకు దున్నడానికి వీలుగా ఉండాలి.
నువ్వులు: మురుగు నీరు నిలవని తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలం. నీరు నిలిచే ఆమ్ల, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు కూడా మంచి దిగుబడినిస్తాయి.

News March 30, 2026

ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

image

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.

News March 30, 2026

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు.. హాలిడేస్‌లో డ్రై రేషన్

image

AP: వేసవి సెలవుల్లోనూ కరవు మండలాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 51 మండలాల్లో డ్రై రేషన్ స్కీమ్ అమలు చేయనుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి నెలకు 4 కిలోలు, ఉన్నత పాఠశాలల స్టూడెంట్స్‌కు 6 కిలోల చొప్పున బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేయనుంది. 2-10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఇది వర్తించనుంది.