News August 5, 2024
నన్ను అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యం: YS జగన్

AP: గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలంటూ హైకోర్టులో <<13783281>>పిటిషన్<<>> వేసిన మాజీ CM జగన్ అందులో కీలక విషయాలు పొందుపర్చారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 19, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 19, 2025
Dhanteras: 50 వేల కార్లు డెలివరీ చేస్తున్న మారుతి సుజుకీ!

ధన్తేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో 50 వేల కార్లను డెలివరీ చేస్తున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. శనివారం 41 వేల కార్లను కస్టమర్లకు అందజేశామని చెప్పింది. ఆదివారం మరో 10 వేలు డెలివరీ చేస్తామని, తద్వారా 51 వేల కార్ల రికార్డును అందుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ SEO పార్థో బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఏడాది ధన్తేరాస్ శనివారం మధ్యాహ్నం 12.18కి ప్రారంభమై, ఇవాళ మధ్యాహ్నం 1.51గం. దాకా కొనసాగనుంది.
News October 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.