News April 14, 2025

మే నాటికి GPOల నియామకం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలోని 10,956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. ‘భూ భారతి’ చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

image

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

News November 14, 2025

IPL: కోల్‌కతా బౌలింగ్ కోచ్‌గా సౌథీ

image

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు KKR ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌథీ.. 2021-2023 మధ్య ఐపీఎల్‌లో KKR తరఫున ఆడారు. ఇటీవలే షారుక్ ఖాన్ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా, షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.

News November 14, 2025

వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

image

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్‌ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.