News September 22, 2024
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు GPS, ఎలక్ట్రిక్ లాకింగ్

AP: తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.
Similar News
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <


