News March 21, 2025
GraamPay సేవలను ప్రారంభించిన శ్రీధర్ బాబు

VIYONA కంపెనీకి చెందిన GraamPay సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు GraamPay ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధికి ఓ గొప్ప ముందడుగుగా ఉంటుందని అభివర్ణించారు. VIYONA భాగస్వామ్యంతో మరిన్ని ఆర్థిక సదుపాయాలు ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు.
Similar News
News November 21, 2025
కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
News November 21, 2025
అక్టోబర్లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

TG: అక్టోబర్లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.
News November 21, 2025
జగిత్యాల: సేకరణ సరే.. చెల్లింపుల్లో జాప్యమెందుకు..?

జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 14 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మొన్నటి వరకు 4,311 మంది రైతుల నుంచి రూ.33.45 లక్షల విలువైన 1.39 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించారు. రైతుల నుంచి మొక్కజొన్నను సేకరించి 20రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే జమ అవుతాయని సంబంధిత అధికారులు అంటున్నారు.


