News November 18, 2024
గ్రేడ్-1 ఫీజు రూ.4.20 లక్షలు!
పిల్లలకు మంచి చదువును అందించాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే, ఆ చదువిప్పుడు కాస్ట్లీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. తన కుమార్తె గ్రేడ్ 1 ఫీజు చూసి షాక్ అయ్యానని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.2వేలు, అడ్మిషన్ ఫీజు రూ.40వేలు, వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్ ఫీజు రూ.1.08 లక్షలు, స్టేషనరీకి రూ.20వేలు ఇలా మొత్తంగా ఫీజు రూ.4.20లక్షలని తెలిపారు.
Similar News
News November 18, 2024
అక్కడ మార్కులుండవ్.. ఎమోజీలే
పిల్లలకు పరీక్షలు, మార్కులు, గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేరళ కొచ్చిలోని CBSE స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాయి. KG నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు.
News November 18, 2024
USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్
అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.
News November 18, 2024
రేపు వరంగల్‌కు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే!
TG: CM రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30కు వరంగల్ చేరుకొని, రోడ్డు మార్గాన ఆర్ట్స్ కాలేజీకి వెళ్తారు. 3.20-3.50వరకు ఇందిరా మహిళా స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం కాలేజీ గ్రౌండ్‌లోని వేదికపైకి చేరుకొని 22జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆపై ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను ప్రారంభించి, 4.40 తర్వాత CM ప్రసంగిస్తారు.