News January 31, 2025
గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ప్రకటన

TG: గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ వి.నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్- కరీంనగర్ అభ్యర్థిగా AICC ఈయన్ను బరిలో నిలిపింది. ఫిబ్రవరి 3న MLC ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, నామినేషన్ల స్వీకరణకు 10 వరకు గడువు ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 13న చివరి తేదీ కాగా 27న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరగనుంది.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


