News January 19, 2025
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2025
WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?
ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.
News January 19, 2025
రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.
News January 19, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల పార్ట్-2’ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్-1 స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పార్ట్-1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.