News October 8, 2024

త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.

Similar News

News December 9, 2025

ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

image

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్‌స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ప్రవర్తించాలన్నారు.

News December 9, 2025

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అసిమ్‌ మునీర్

image

పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా నియమితులైన అసిమ్‌ మునీర్ మరోసారి భారత్‌ లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే పాక్ ప్రతిస్పందన ఈసారి మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అణుబాంబు బెదిరింపులు సహా గతంలో కూడా <<18043029>>మునీర్‌<<>> ఇలాంటి కామెంట్స్ చేశారు.

News December 9, 2025

గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.